Sunday, January 29, 2023
Homeతాజా వార్తలునేను ఫ్రెండ్లీ జర్నలిస్ట్ ఎమ్మెల్యేను

నేను ఫ్రెండ్లీ జర్నలిస్ట్ ఎమ్మెల్యేను

“నేను ఫ్రెండ్లీ జర్నలిస్ట్ ఎమ్మెల్యేను. ఇప్పటికే 3,500 టీవీ చర్చల్లో పాల్గొన్నా. కొన్ని వేల ప్రెస్ మీట్లు పెట్టా.22సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం లో, ప్రభుత్వం లో ఎమ్మెల్యే గా ఉన్నా. ఏనాడూ జర్నలిస్టుల ను పల్లెత్తు మాట అన లేదు. సాక్షి విలేకరి పోశెట్టిపై జరిగిన దాడి ఘటన దారుణం.ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. పోశెట్టిపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను స్వయంగా పోలీస్ అధికారులను కోరాను.హత్యాయత్నం నేరం కింద కేసు లు నమోదు చేయమన్నా”అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. సాక్షి విలేకరి పోశెట్టి పై దాడికి సంబంధించి జర్నలిస్టు సంఘాల నేతలు కే. శ్రీనివాసరెడ్డి, శ్రీగిరి విజయ్ కుమార్ రెడ్డి తదితరులతో సమావేశమైన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పోశెట్టిపై దాడికి సంబంధించిన వివరాలను తెలిపి తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని జర్నలిస్టు సంఘాల నాయకులకు వివరణ ఇచ్చారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వెళ్లానని, 15వ తేదీ రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకున్న తనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని ఆయన చెప్పారు. తాను లేని సమయంలో, తనకెలాంటి సంబంధం లేకుండా జరిగిన జర్నలిస్ట్ పై దాడి ఘటనను తనకు ఆపాదించ డాని కి రాజకీయ కుట్ర చేయడం తనకు బాధ కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజు టీవీ చర్చల్లో,ప్రెస్ మీట్లలో, సోషల్ మీడియాలో ఉంటానని, అలాంటి తాను ఒక జర్నలిస్టుపై ఎందుకు దాడి చేస్తానని ఆయన బాధను వ్యక్తంచేశారు. “నేను వీడియో కాల్ ద్వారా పోశెట్టిని పరామర్శించా. ఇక నుంచి ఆయన బాధ్యత నేనే తీసుకుంటానని హామీ ఇచ్చా. ఇక ముందు ఎలాంటి దాడులు జరగాకుండా చర్యలు తీసుకుంటాం.ఆయన కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆడుకుంటా. నన్ను నమ్మి ఆందోళన కార్యక్రమాలు రద్దు చేసిన జర్నలిస్టు సంఘాలకు నా ధన్యవాదాలు. ఈ సమస్యను పరిష్కరించిన జర్నలిస్టు పెద్దలకు కృతజ్ఞతలు అని జీవన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘం నేత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పోశెట్టిపై దాడికి సంబంధించి సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హుందాగా వ్యవహరించారని,దీని వల్ల ఆయన స్థాయి పెరిగిందే తప్ప తగ్గలేదన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎంతో భవిష్యత్ ఉన్న నేత అని, ఆయన ఎలాంటి భేషజాలకు పోకుండా సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారని అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

LATEST NEWS