విధాత: ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. ఏపీలో గత 24 గంటల్లో44,771 మందికి కరోనా పరీక్షలు చేయగా 13,474 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది చనిపోయారు.
కరోనా నుంచి మరో 10,290 మంది బాధితులు కోలుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొన్నది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,09,493 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపింది.