విధాత: దేశంలో కరోనా కోరలు చాస్తున్నది. వరుసగా రెండోరోజు మూడు లక్షల మార్కును దాటింది. దేశంలో కొత్తగా 3,47,254 కరోనా కేసులు నమోదయ్యాయి. 703 మంది మరణించారు. కరోనా నుంచి మరో 2,51,777 మంది బాధితులు కోలుకున్నారు.
దేశంలో ప్రస్తుతం 20,18,825 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 17.94 శాతానికి పెరిగింది. కొత్తవేరియంట్ ఒమిక్రాన్ కేసులు 9,692 కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశంలో ఇప్పటివరకు 160.43 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్లో వెల్లడించింది.