విధాత: ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూను ఎత్తివేయాలని ఆప్ సర్కారు నిర్ణయించింది. కర్ఫ్యూ ఎత్తివేయాలని లెఫ్టినెంట్ గవర్నర్కు ఢిల్లీ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కు సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు.
ఢిల్లీలో కొన్నిరోజుల నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వం దుకాణాలు, వ్యాపార సముదాయాల కార్యకలాపాలకు రోజంతా అనుమతించనున్నది. 50 శాతం సిబ్బందితో పనిచేసేలా ప్రైవేట్ కార్యాలయాలకు అనుమతి ఇవ్వనున్నది.
