విధాత: సూర్యపేట పట్టణంలో నాలాల ఆక్రమణలపై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఆక్రమణలను తక్షణం తొలగించాలంటూ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
కళ్యాణాలక్ష్మి/షాదిముబారక్ చెక్ లను ఇంటింటికి అందజేసే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం పట్టణంలోని మానస నగర్ కు చేరుకోగా అక్కడి ప్రజలు నాలాల ఆక్రమణ లపై మంత్రి జగదీష్ రెడ్డికి ఏకరవు పెట్టుకున్నారు.
దానిపై స్పందించిన మంత్రి స్వయంగా పరిశీలించి అక్కడికక్కడే మున్సిపల్ కమిషనర్ తో పాటు ఇంజినీరింగ్ అధికారులను పిలిపించి తక్షణమే తొలగించాలని ఆదేశించారు