విధాత: మాజీ లోక్సభ సభ్యుడు, కాంగ్రెస్ నేత రతన్జిత్ ప్రతాప్ నారాయణ్ సింగ్ (RPN Singh) మూడు నాలుగు రోజుల్లో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. ఆర్పీఎన్ సింగ్, బీజేపీ నేతల మధ్య ఈ మేరకు ఒప్పందం జరిగిందని తెలుస్తున్నది. అన్నీ కుదిరితే ఆర్పీఎన్ సింగ్ మూడు నాలుగు రోజుల్లో కాంగ్రెస్ను వీడి కమలం గూటికి చేరవచ్చు.
