విధాత: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అక్కడ ఎన్ని పార్టీలు బరిలో ఉన్నప్పటికీ బీజేపీ, ఎస్పీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. సీఎం అభ్యర్థులుగా బీజేపీ నుంచి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ నుంచి అఖిలేశ్ యాదవ్ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. అయితే కాంగ్రెస్ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపై సర్వత్రా చర్చనీయంశం అయ్యింది.
