విధాత: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న యూపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎస్పీ అధినేత మొన్నటిదాకా ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. తాజాగా ఆయన మనసు మార్చుకుని ఎన్నికల బరిలో దిగుతున్నట్టు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడి నుంచి పోటీచేస్తారనే ఆసక్తి నెలకొన్నది. అయితే మెయిన్‌పురిలోని కర్హాల్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది
