విధాత: కృష్ణా జిల్లా గుడివాడ కాసినో వ్యవహారంపై పోలీసులు విచారిస్తున్నారు. సంక్రాంతి పండుగ రోజుల్లో కాసినో, చీర్ గర్ల్స్ డ్యాన్సులపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. నూజివీడు డీఎస్పీ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. శిబిరం నిర్వాహకుల నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు.
వీడియోల పరిశీలన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసుల నుంచి డీఎస్పీ వివరాలు సేకరించనున్నారు. మరో 2 రోజుల పాటు పోలీసులు విచారణ జరుపనున్నారు. డీఎస్పీ శ్రీనివాస్ ఆదివారం ఎస్పీకి నివేదిక ఇవ్వనున్నారు.
