విధాత: నేటి నుంచి వైద్యారోగ్యశాఖ ఇంటింటా జ్వర సర్వే నిర్వహించనున్నది. వైద్య సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించనున్నది.
లక్షణాలు ఉన్నవారికి అప్పటికప్పుడే ఔషధ కిట్లు అందించనున్నది. వైద్యారోగ్యశాఖ కోటి ఔషధ కిట్లను సిద్ధం చేసింది. అధికారులు ఔషధ కిట్లను రాష్ట్రవాప్తంగా అన్నిహాస్పిటల్స్కు పంపారు.
కిట్లో అజిత్రోమైసిన్, పారాసిటమాల్, లెవో సిట్రిజన్, రానిటిడైన్, విటమిన్ సీ, మల్టీ విటమిన్ డీ మందులుంటాయి. నాలుగైదు రోజుల్లో జ్వర సర్వే పూర్తయ్యేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
