విధాత: కొవిడ్ వ్యాక్సినేషన్లో టీనేజర్లు యాక్టివ్గా పాల్గొంటున్నారని కేంద్రం తెలిపింది. జనవరి 10న ప్రారంభమైన 15-18 ఏండ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా దేశ వ్యాప్తంగా 52 శాతం టీకా తొలి డోసు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
టీనేజర్లకు టీకా పంపిణీలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్టు తెలిపారు. ఏపీ 91 శాతంమందికి టీకా తొలి డోసు పంపిణీ చేసింది. 83 శాతంతో హిమాచల్ ప్రదేశ్ రెండోస్థానంలో, 71శాతంతో మధ్యప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి. తెలంగాణ 55 శాతం మందికి టీకా పంపిణీ చేసి 19 స్థానంలో నిలిచినట్టు కేంద్రం వివరించింది.
