వాషింగ్టన్: ఉక్రెయిన్పై రష్యా దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఖండించారు. అన్యాయమైన దాడులతో ఉక్రెయిన్ ప్రజలను బాధపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉక్రెయిన్లో పరిణామాలకు రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఉక్రెయిన్పై రష్యా మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించిన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. రష్యా దాడికి ప్రతిచర్య తప్పదన్నారు.ముందస్తుగా నిర్ణయించుకునే పుతిన్ యుద్ధానికి దిగారని చెప్పారు. ఇది తీవ్రమైన విపత్తు, మానవాళి నష్టానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా, ఉక్రెయిన్ పరిణామాలను గమనిస్తున్నామని చెప్పారు. శుక్రవారం జీ-7 దేశాలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నాటో కూటమికి సహకరిస్తామని తెలిపారు.