
టాలీవుడ్ హీరోల సతీమణులందరూ దాదాపు సోషల్ మీడియాలో ఉన్నారు. మహేశ్ బాబు భార్య నమ్రత, రామ్ చరణ్ భార్య ఉపాసన, అల్లు అర్జున్ సతీమణి స్నేహ యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి కూడా నెట్టింట్లోకి వచ్చేసినట్టు ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది.
నిజమో కాదో తెలియదు గానీ.. లక్ష్మీప్రణతి పేరిట ఓ ట్విట్టర్ ఖాతా ఓపెన్ అయింది. ‘లక్ష్మీఎన్టీఆర్’ అనే యూజర్ ఐడీతో నాలుగు రోజుల కిందటే అకౌంట్ ఓపెన్ అయినట్టు తెలుస్తోంది. ఆ ఖాతాలో ఎన్టీఆర్ తో లక్ష్మీప్రణతి కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేశారు. ‘‘ట్విట్టర్ లో మీ అందరితో కలుస్తున్నందుకు ఆనందంగా ఉంది. నా ప్రియమైన భర్త ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫొటోను ఫస్ట్ పోస్టుగా పెడుతున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. తాజాగా నిన్న త్రోబ్యాక్ పిక్ అంటూ రాజమౌళి ఫ్యామిలీతో ఉన్న ఫొటోను ఖాతాలో పోస్టు చేశారు.