విధాత: గోవా మాజీ సీఎం, దివంగత మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ బీజేపీకి గుడ్‌బై చెప్పాడు. ఉత్పల్ గోవా రాజధాని పణజీ నియోజకవర్గ టికెట్ ఆశించినా బీజేపీ అధిష్ఠానం తనకు టికెట్ ఇవ్వలేదు. ఆ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యేకే కేటాయించింది. దీంతో తీవ్ర నిరాశ చెందిన ఉత్పల్ ఇక తాను బీజేపీలో కొనసాగలేనంటూ శుక్రవారం తన రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. అంతేకాదు పణజీ స్థానం నుంచే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీగా దిగుతానని ప్రకటించారు.
