విధాత: తెలంగాణలో మరోసారి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉన్నది. వ్యవసాయభూముల మార్కెట్ విలువలను 50 శాతం పెంచనున్నట్టు సమాచారం.
స్థలాల విలువను 35 శాతం, అపార్ట్మెంట్ విలువను 25 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ప్రభుత్వ నిర్ణయంపై మరో రెండురోజుల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ స్పష్టత ఇవ్వనున్నది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నది.
