విధాత: రాష్ట్రాభివృద్ధిలో వైసీపీ, టీడీపీలు ఘోరంగా విఫలమయ్యాయని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. రెండు పార్టీలు కుటుంబ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన తెలిపారు.
సీఎంలు రాయలసీమ నుంచి ఉన్నప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధిని మరిచారని సోము అన్నారు. రాయలసీమలో ఆర్థిక వనరులున్నా అభివృద్ధి లేకుండా చేశారని ఆయన చెప్పారు.
